హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పెగడపల్లిలో పాఠశాల ఏర్పాటు చేయాలి'

BHPL: మహాముత్తారం మండలం పెగడపల్లి గ్రామపంచాయతీలో వెంటనే ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేయాలని SFI రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్ డిమాండ్ చేశారు. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో సుమారు 60 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా పాఠశాల లేకపోవడం బాధాకరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.