హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం

MDK: విద్యుత్ షాక్ తగిలి ఓ మహిళ మృతి చెందిన ఘటన చీకోడ్‌లో జరిగింది. పొలం పనులకు వెళ్లిన బద్దం శోభారాణి దాహం తీర్చుకునేందుకు బోరుబావి వద్దకు వెళ్లి, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురై అక్కడికక్కడే కన్నుమూసింది. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడు సంపత్ ఫిర్యాదుతో ఎస్ఐ కేసు నమోదు చేశారు.