హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తలసేమియా చిన్నారికి రూ.10 వేల సాయం!

W.G: కాళ్ళ మండలం ఏలూరుపాడుకి చెందిన మంతెన రవివర్మ 'మంతెన వెంకట సూర్యనారాయణరాజు, సుభద్రయ్య ఫౌండేషన్' ద్వారా ఉండికి చెందిన తలసేమియా బాధిత చిన్నారికి శుక్రవారం రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేశారు. తమ తల్లిదండ్రుల పేరిట స్థాపించిన ఈ ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు, బాధితులకు నిరంతరం పలు సేవా కార్యక్రమాలు అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.