సత్యసాయి: పెనుకొండ మండలం కొనాపురం గ్రామంలో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను మంత్రి సవిత పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనుల్లో వేగం పెంచి రోడ్డును త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మంత్రి సవిత


