MNCL: తాండూర్ మండలం రాజీవ్ నగర్ మిషన్ భగీరథ పైపులైన్ శుక్రవారం పగిలి తాగునీరు వృథాగా పోతోంది. నీరు రోడ్డుపై ప్రవహిస్తుండటంతో వాహనదారులు, ప్రజలు, విద్యార్థులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నీరుతో చిన్నారులు జారిపడే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి పైపులైన్ మరమ్మతులు చేపట్టాలన్నారు.
తెలంగాణ
VIDEO: భగీరథ పైపులైన్ పగిలి తాగునీరు వృథా


