హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో వర్షం సూచనలు

బాపట్ల జిల్లాలో రానున్న మూడు గంటల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటకు 30–40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి చెట్ల కింద నిలవకుండా, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.