హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పీజీఆర్ఎస్ కార్యక్రమానికి వినతుల వెల్లువ

ASR: పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి 101, రెవెన్యూ క్లినిక్‌కు 78 మొత్తం 179 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ నిశాంతి వివిధ మండలాల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. రహదారి, తాగునీటి సమస్యలపై అధికంగా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.