WGL: నర్సంపేట ఆర్టీసీ డిపోలో ప్రయాణికుల ఇబ్బందులు తొలగించాలని జనసేన నేత మేరుగు శివకోటి యాదవ్ డిపో మేనేజర్ సరస్వతికి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్, శ్రీశైలం, భద్రాచలం, ఆదిలాబాద్ సర్వీసులు తగ్గించారని, సిబ్బంది కొరత ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఆమె సర్వీసులు పెంచామని, కొత్త సిబ్బందిని తీసుకుంటున్నామని వెల్లడించారు. ఈ కార్య్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'RTC సర్వీసులు పునరుద్ధరించాలి'


