హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గిద్దలూరులో రేపు ప్రజా దర్బార్

ప్రకాశం: గిద్దలూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌రెడ్డి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకోనున్నారు. గిద్దలూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, గిద్దలూరు పట్టణ ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో ఎమ్మెల్యేకు తెలియజేయవచ్చని టీడీపీ కార్యాలయం తెలిపింది.