హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న రామచంద్రపురంలో ఉద్యోగ మేళా

తూ.గో: రామచంద్రపురంలో ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ కార్యాలయం తెలిపింది. 18-35 ఏళ్ల వయసు కలిగిన టెన్త్‌, ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్‌ అభ్యర్థులకు 8 కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఎంపికైన వారికి రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు జీతం ఉంటుందని తెలిపారు.