హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై పశువుల సంచారం

నెల్లూరు: అనంతసాగరం మండలంలోని చాపరాలపల్లి, యాకర్లపాడు, ఎగువపల్లి, చిలకల మర్రి వద్ద జాతీయ రహదారి 565పై పశువుల సంచారం ఎక్కువగా ఉన్నది. దీంతో వాహన చోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. గతంలో పశువులను ఢీ కొట్టి ప్రమాదాలు జరిగిన సంఘటనలు ఉన్నాయి. పశు యజమానులు తమ పశువులను రోడ్లపైకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పలువురు చెబుతున్నారు.