మంచిర్యాల: కూరగాయల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని ఏఈఓ అక్రమ్ అన్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయం మిషన్‌లో భాగంగా శుక్రవారం జన్నారం క్లస్టర్ పరిధిలోని రైతులకు రసాయనాలను ఉపయోగించకుండా కూరగాయలు సాగు చేయడంపై అవగాహన కల్పించారు. కూరగాయల సాగుతో రైతులకు మేలు జరగడంతో పాటు మంచి ఆదాయం వస్తుందన్నారు. కార్యక్రమంలో కృషి సఖిలు జక్కుల రజిత, అంజలి, రైతులు ఉన్నారు.
తెలంగాణ
'కూరగాయల సాగుతో రైతులకు మేలు జరుగుతుంది'


