హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అధికారులకు టెలికాన్ఫరెన్స్‌లో జేసీ సూచనలు

కోనసీమ జిల్లాలో పింఛన్ దరఖాస్తుల క్షేత్రస్థాయి పరిశీలనను నిబంధనల ప్రకారం వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ వై. ఖోమ్ నైడియా దేవి అధికారులను ఆదేశించారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, డీపీవోలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు.