చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు పాల్గొన్నారు. ఎమ్మెల్యేతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సమస్యల పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. నీటి సమస్యలు, మౌలిక సదుపాయాలపై వచ్చిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇవ్వాలని సూచించారు. మొత్తం 37 వినతులు అందాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే కార్యాలయంలో ప్రజా దర్బార్


