హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రావులపాలెం ప్రజా దర్బార్‌కు 712 వినతులు

కోనసీమ: రావులపాలెం (మం) గోపాలపురం గ్రామాన్ని సొంత ఊరిలా భావించి అభివృద్ధి చేస్తానని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. శుక్రవారం గోపాలపురంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఆయన 712 వినతులు స్వీకరించారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కమ్యూనిటీ హాళ్లు, కల్వర్టులు, పుష్కర ఘాట్ల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెల్లడించారు.