కృష్ణా: పమిడిముక్కల మండలం గురజాడలో రూ.5 లక్షల వ్యయంతో నిర్మించనున్న MPP స్కూల్‌కు పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా శుక్రవారం శంకుస్థాపన చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విద్యా సదుపాయాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
MPP స్కూల్ నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన


