హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్తు పదార్థాలపై పోలీసుల ప్రత్యేక నిఘా

శ్రీకాకుళం జిల్లాలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదేశాలతో టెక్కలి ఇన్‌స్పెక్టర్ విజయ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం నార్కోటిక్ డాగ్ స్క్వాడ్‌తో రైల్వే స్టేషన్, బస్టాండ్‌లలో తనిఖీలు చేశారు. అనుమానిత ప్రదేశాలు, దుకాణాలు, వాహనాలు, ప్రయాణికుల లగేజీలను జాగిలాల సహాయంతో క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.