హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విద్యార్థుల ప్రతిభకు 'జ్ఞానధార' చక్కని వేదిక'

GDWL: విద్యార్థులోని సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేందుకు 'జ్ఞానధార' మంచి వేదికగా నిలుస్తుందని జిల్లా జోగులాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. శుక్రవారం ఐడీసీ ఆవరణలో గిరిజన గురుకుల విద్యాసంస్థల ఆధ్వర్యంలో రూపొందించిన 'జ్ఞానధార - వాయిస్ బియాండ్ క్లాస్‌రూమ్స్' త్రైమాసిక పత్రిక తొలి సంచికను ఆయన ఆవిష్కరించారు.