హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'రైతులకు పట్టాలు ఇవ్వాలి'

ASR: కొండపోడు పట్టాల పంపిణీలో జాప్యంతో ఆదివాసీ రైతులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారని సీపీఎం అరకు మండల నేత బుజ్జిబాబు ఆరోపించారు. బొండం పంచాయతీలో సబ్-డీఎల్‌సీలో ఆమోదం పొందిన 64మంది రైతులకు వెంటనే పట్టాలు పంపిణీ చేయాలని కోరుతూ శుక్రవారం పాడేరు ఐటీడీఏలో అధికారులకు వినతిపత్రం ఇచ్చి, నిరసన చేపట్టారు. 2024నుంచి దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన చెందారు.