హైదరాబాద్: 28°C
తెలంగాణ

'22-ఏ భూములపై సమగ్ర విచారణ చేపట్టాలి'

జనగామ పట్టణంలో 22-ఏ జాబితాలో ఉన్న భూములు, ఆస్తుల రికార్డులపై సమగ్ర విచారణ చేపట్టాలని టీపీసీసీ స్పోక్స్‌పర్సన్ నూక కిరణ్ యాదవ్ డిమాండ్ చేశారు. శుక్రవార ఈ మేరకు జిల్లా కలెక్టర్‌కు లేఖ సమర్పించారు. సంబంధిత భూముల రెవెన్యూ, రిజిస్ట్రేషన్ రికార్డులతో పాటు పహాణీలు, ఆర్‌ఓఆర్, భూ భారతి/ధరణి, పట్టాదార్ పాస్‌బుక్, మ్యుటేషన్ రికార్డులను పరిశీలించాలని కోరారు.