హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కన్నులపండువగా వినాయక నిమజ్జనం

కడప నగరంలోని చిన్నచౌక్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని శుక్రవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలతో పాటు ఉట్టి కొట్టే పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. చిన్నారులు చిన్నకృష్ణుల వేషధారణలో పాల్గొని అలరించగా, యువకులు ఉట్టి కొట్టే కార్యక్రమంలో పాల్గొన్నారు. వేడుకల అనంతరం స్వామివారి విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో పూర్తి చేశారు.