హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఎస్సీ, ఎస్టీ సంక్షేమ నిధులను సద్వినియోగం చేసుకోవాలి'

ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి కేటాయించిన నిధులను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య పేర్కొన్నారు. గద్వాల ఐడీసీ సమావేశ మందిరంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్, ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, భూ సమస్యలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.