హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కుడో పోటీల్లో జిల్లా ప్రతిభను చాటాలి'

అనకాపల్లిలో 6వ కుడో రాష్ట్ర స్థాయి పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కలెక్టర్ విజయ కృష్ణన్ జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. క్రీడాకారులు తమ నైపుణ్యంతో జిల్లాకు గుర్తింపు తేవాలని ఆమె పిలుపునిచ్చారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడాధికారి శైలజ, కుడో సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.