హైదరాబాద్: 28°C
తెలంగాణ

'అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం వేడుకలు'

KMM: మధిర పట్టణంలోని సుందరయ్యనగర్ అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఐసీడీఎస్ సూపర్‌వైజర్ జ్యోతికుమారి ఆధ్వర్యంలో పోషణ మాసం వేడుకలు నిర్వహించారు. తల్లి గర్భం దాల్చినప్పటి నుంచి శిశువు రెండేళ్ల వయసు వరకు ఉండే తొలి 1,000 రోజుల ప్రాధాన్యతను వివరించారు. గర్భిణులు, బాలింతలు, తల్లిదండ్రులకు పోషకాహారం, ఆరోగ్య సంరక్షణపై అవగాహన కల్పించారు.