హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్మార్ట్ రేషన్ కార్డులు అందజేత

గద్వాల్ మండలంలో అనంతపురం గ్రామంలో నేడు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్ కే. నిత్య వెంకటేష్, ఉపసర్పంచ్ సి. సురేంద్ర హాజరై లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రేషన్ కార్డు ద్వారా అందే ప్రయోజనాలు సకాలంలో ప్రజలకు అందేలా కృషి చేస్తామని నాయకులు తెలిపారు.