ASR: డుంబ్రిగుడ మండలం గోరపూర్‌లో శుక్రవారం అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం వైసీపీ నేతలు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సర్పంచ్, ఎంపీటీసీ అభ్యర్థులను స్థానిక నేతలు, కార్యకర్తల మద్దతుతోనే ఎంపిక చేస్తామని తెలిపారు. పార్టీ కోసం కష్టపడిన వారికి అవకాశం కల్పిస్తామని స్పష్టం చేశారు. వ్యక్తిగత విభేదాలు వీడి, పార్టీ బలోపేతానికి పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'స్థానిక నేతల మద్దతుతోనే అభ్యర్థుల ఎంపిక'


