E.G: రాజమండ్రి మహా కాళేశ్వర స్వామి ఆలయంలో మహిళా మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని కోరుతూ.. స్వామివారి సన్నిధిలో అఖండ దీపాన్ని వెలిగించి ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు మల్లిడి సుబ్బలక్ష్మితో పాటు పలువురు మహిళా మోర్చా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
మోదీ ఆరోగ్యం కోసం రాజమండ్రిలో పూజలు


