BHPL: తెలంగాణ ఉద్యమకారుల ఫోరం 9వ వార్షికోత్సవాన్ని ఈనెల 27న యాదగిరిగుట్టలో నిర్వహించనున్నట్లు చిట్యాల మండల అధ్యక్షులు జన్నె యుగేందర్ తెలిపారు. ఈ సందర్భంగా “హలో కళాకారుడా.. చలో యాదగిరిగుట్ట” పోస్టర్‌ను ఆవిష్కరించారు. రాష్ట్రంలోని ఉద్యమకారులంతా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
“హలో కళాకారుడా.. చలో యాదగిరిగుట్ట” పోస్టర్ అవిష్కరణ


