హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనారోగ్య బాధితులకు ప్రభుత్వం అండ!

GNTR: పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. తెనాలిలోని తన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 47 మంది లబ్ధిదారులకు రూ.50.73 లక్షల విలువైన సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 680 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందించినట్లు తెలిపారు.