హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులతో మంత్రి సవిత ముఖాముఖి

సత్యసాయి: పెనుకొండ పరిటాల శ్రీరాములు డిగ్రీ కళాశాలలో ‘యువత భవితకు భరోసా’ కార్యక్రమం నిర్వహించారు. మంత్రి సవిత విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ నిర్వహణకు నారా లోకేష్ కృషి చేసి మాట నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు.