హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటింటికి మన్యం పోలీస్

PPM: కురుపాం మండలం వెలగమానుగూడ, ఆగంగూడ గ్రామాలను నీలకంఠపురం ఎస్సై రమేష్ నాయుడు శుక్రవారం సందర్శించి “ఇంటింటికి మన్యం పోలీస్” కార్యక్రమం నిర్వహించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సైబర్ నేరాలు, మహిళలపై నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణ, గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుళ్లు వేణు, చంద్రశేఖర్ పాల్గొన్నారు.