హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాటన్ మిల్ వద్ద పత్తి రైతుల ధర్నా

NRPT: ఉట్కూర్ మండలంలోని విజయ్ కాటన్ మిల్ వద్ద పత్తి రైతులు పెద్దఎత్తున ధర్నా చేపట్టారు. క్వింటాలు పత్తికి కనీస మద్దతు ధర రూ.9,600 చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. స్థానిక వ్యాపారులు సరైన ధర ఇవ్వకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని గిట్టుబాటు ధర లభించేలా తగిన చర్యలు తీసుకోవాలని రైతు నాయకులు కోరారు.