హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి'

ASR: డుంబ్రిగుడ మండలం అరకు పంచాయతీలో ప్రభుత్వ భూములను పరిరక్షించాలని గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం పాడేరు ఐటీడీఏలో నిరసన తెలిపి, కలెక్టర్‌కు వినతి అందించారు. నేరెడువలస పాఠశాల సమీపంలో సర్వే నం.54/3లో 1.16 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతోందన్నారు. ప్రభుత్వ స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.