హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్

HNK: జిల్లాలో శుక్రవారం AIDS నివారణ, అవగాహనపై నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..HIVపై ప్రజల్లో అపోహలు తొలగించి, వ్యాధి నివారణ చర్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. యువత, విద్యార్థులు ఎయిడ్స్ నియంత్రణపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ర్యాలీలో వైద్య సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు