హైదరాబాద్: 28°C
తెలంగాణ

'లెక్కలపై అవగాహన పెంచుకోవాలి'

HNK: లెక్కలపై అవగాహన పెంపొందించుకోవాలని కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం అన్నారు. శుక్రవారం హన్మకొండ నగరంలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో లెక్కల విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణను ప్రారంభించారు. లెక్కలను స్వయంగా చేయడం ద్వారా మేధాశక్తి, తార్కిక ఆలోచనా విధానం పెరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొ. డి.సుకుమార్ పాల్గొన్నారు.