హైదరాబాద్: 28°C
తెలంగాణ

క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించిన ఎస్పీ

​సంగారెడ్డి జిల్లా నందికంది వద్ద NH–65పై చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంపై జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తక్షణమే స్పందించారు. ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నారు. ఎస్పీ చూపిన చొరవను పలువురు ప్రశంసించారు.