హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాజీ మంత్రి ప్రత్యేక పూజలు

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని సద్దులగుండు డివిజన్‌లో వినాయక చవితి సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ వివిధ వినాయక మండపాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు నరేష్ లక్ష్మీ, మధుమోహన్, గోపి, రాములు, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.