హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పలకజీడిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు

ASR: పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆరోగ్యకర జీవనం సాధ్యమని కొయ్యూరు మండలం యూ.చీడిపాలెం పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ హేమంత్ చౌదరి పేర్కొన్నారు. సేవా సంకల్ప్ అభియాన్లో భాగంగా శుక్రవారం ఆయన పలకజీడి గ్రామంలో మెడికల్ క్యాంపు ఏర్పాటుచేశారు. పలువురు ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందించారు.