హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ మోసానికి పాల్పడిన VOA

ADB: గాదిగూడలోని సావ్రి గ్రామానికి చెందిన మహిళా సంఘాల సభ్యులు VOA జ్ఞానేశ్వర్ చేతిలో రూ. 2.65 లక్షల వరకు మోసపోయారు. నిందితుడు నకిలీ తీర్మానం సృష్టించి, మూడు మహిళా సంఘాల నుంచి రూ. 55 వేల చొప్పున రూ. 1.65 లక్షలు కాజేశాడు. అంతేకాక పిండి గిర్నీ, కిరాణా షాపు రుణాల పేరిట మరొక ఇద్దరి వద్ద రూ. లక్ష వసూలు చేసినట్లు బాధితులు తెలిపారు.