KMM: సత్తుపల్లి మండలం రామానగరం గ్రామానికి చెందిన మేకల సుహాని ప్రతిభతో ఎంబీబీఎస్ సీటు సాధించడంతో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తన క్యాంప్ కార్యాలయంలో ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. సుహాని ఉన్నత చదువులు చదివి భవిష్యత్తులో పేదలకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించి మంచి పేరు తేవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
తెలంగాణ
MBBS సీటు సాధించిన సుహానికి సండ్ర అభినందనలు.!


