W.G: కాళ్ల (మం) కాళ్ళకూరు శ్రీ స్వామివారి దేవస్థానం శాశ్వత అన్నదానానికి రూ.1,01,116 ఫిక్స్డ్ డిపాజిట్ దాఖలు చేసినట్లు ఛైర్మన్ అడ్డాల శివరామరాజు శుక్రవారం తెలిపారు. దివంగత జంపన సూర్యనారాయణరాజు, సీతమ్మ జ్ఞాపకార్థం జంపన నరసింహరాజు, సుబ్బలక్ష్మి దంపతులు ఈ విరాళం అందించారు. దాతలకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలతో పాటు వేదాశీర్వచనం అందజేసినట్లు ఆయన వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
శాశ్వత అన్నదానానికి ఫిక్స్ డిపాజిట్


