హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఆరోగ్యానికి పోషకాహారం తీసుకోవాలి'

AKP: ఆరోగ్యానికి తప్పనిసరిగా పోషకాహారం తీసుకోవాలని ఐసీడీఎస్ సూపర్వైజర్ ఉన్నిషా సూచించారు. ఎస్ రాయవరం మండలం కొత్త రేవుపాలవరంలో పోషకాహార మాసోత్సవాల్లో భాగంగా పోషకాహారం ప్రాముఖ్యతపై గర్భిణీలు బాలింతలకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆమె ఆకుకూరలు, కూరగాయలతో పోషకాహారాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరించారు.