హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రజా సమస్యలను పరిష్కరించడమే లక్ష్యం'

VZM: ప్రజా సమస్యలను పరిష్కరించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. ఈ మేరకు ఆమె శుక్రవారం టీడీపీ క్యాంపు కార్యాలయంలో "ప్రజా సమస్యల పరిష్కార వేదిక" నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి 37 వినతులను స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ..  సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.