SKLM: ప్రజా సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించి మండల అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే కూన రవికుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పొందూరు ఎండీవో కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వివిధ శాఖల పనితీరును సమీక్షించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలి'


