హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

10వ తరగతి వృత్తి విద్య పరీక్షల్లో 100% ఉత్తీర్ణత

నెల్లూరు: ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు PM SHRI జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న 10వ తరగతి వృత్తి విద్య (Vocational Education) పరీక్షల్లో BFSI, IT ట్రేడ్ల విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు పాఠశాల హెచ్ఎం మల్లికార్జున శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. విద్యార్థులను పలువురు, ఉపాధ్యాయులు అభినందించారు.