SKLM: రణస్థలం మండలం పాతర్లపల్లి పీహెచ్‌సీని ఎమ్మెల్యే ఈశ్వరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించారు. అనంతరం రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలు, మందుల లభ్యత, సిబ్బంది హాజరు తదితర అంశాల గురించి తెలుసుకున్నారు. ప్రజల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్నీ సహించేది లేదని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
పాతర్లపల్లి పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ


