హైదరాబాద్: 28°C
తెలంగాణ

గంజాయి సాగుపై దాడి..!

ఆదిలాబాద్ రూరల్ మండలం పొట్టంలొద్దిలో అక్రమంగా సాగు చేస్తున్న 385 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. వీటి విలువ సుమారు రూ.38.50 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మెస్రం గంగారాం పటేల్, మెస్రం నాగులపై ఎన్డీపీఎస్ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ వివరించారు.