హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుకొండలో రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు: మంత్రి సవిత

సత్యసాయి: పెనుకొండ మున్సిపాలిటీలోని 10, 11 వార్డుల్లో మంత్రి సవిత శుక్రవారం పర్యటించారు. సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రూ.40 లక్షలతో పనులు పూర్తయ్యాయని, మరో రూ.60 లక్షల పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. మున్సిపాలిటీకి రూ.20 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రామకంఠంలో ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు పొజిషన్ పత్రాలు అందజేశారు.