హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గరుడ సేవ కోసం తిరుమలకు చేరిన గొడుగులు

TPT: తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున 9 గొడుగులు తిరుమలకు చేరాయి. సమితి ట్రస్టీ శ్రీ ఆర్.ఆర్. గోపాల్ జీ ఈ గొడుగులను టీటీడీ ఈవో శ్రీ ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరికి అందజేశారు. వరుసగా 22వ సారి శ్రీవారికి గొడుగులను సమర్పించడం విశేషం.