హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29న పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికలు

VZM: తెర్లాం మండలంలోని వివిధ పాఠశాలల్లో ఈ నెల 29న పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎంఈవో జె. త్రినాథరావు తెలిపారు. 18న ఓటర్ల జాబితా ప్రచురణ, 25న అభ్యంతరాల స్వీకరణ, తుది జాబితా ఖరారు చేస్తామన్నారు. 29న సభ్యుల ఎన్నిక అనంతరం ఛైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక, ప్రమాణ స్వీకారం నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు.